రాజకీయం

కలల ప్రాజెక్టులు కళ్ళ ముందు

151 Views

సెప్టెంబర్ 15 సిద్దిపేట జిల్లా

తెలంగాణ సాగునీటి రంగ చరిత్రలో మరో చారిత్రక ఘట్టం

మెదక్ డీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి

కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వలనే కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యమైంది,
ఎన్నో సంవత్సరాల కల, తరతరాల ఎదురుచూపులు… అవన్నీ నెరవేరే సమయం ఆసన్నమైంది. నెర్రెలు బారిన పడేందుకు పాలమూరు నేలను తడిప కృష్ణమ్మ పైకెగసి రానుంది.

ఊహకందని భారీ నిర్మాణాలు, అద్భుత సాంకేతికత, భారీ సొరంగాలు, భూగర్భంలోనే సర్జిపూల్స్‌, పంప్ హౌస్‌లు ఈ ఎత్తిపోతలకు తలమానికంగా నిలుస్తున్నాయి. కాళేశ్వరాన్ని మించి బాహుబలి నిర్మాణాలకు ‘పాలమూరు’ ప్రాజెక్టు వేదికగా నిలుస్తోంది.

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం రేగిమానుగడ్డ వద్ద నిర్మించిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని మొదటి పంప్ హౌస్ ప్రారంభానికి సిద్ధమైంది. కోతిగుండు నుంచి కృష్ణా నదీ జలాలను కాలువ ద్వారా పంప్ హౌస్ కు తరలించి నార్లాపూర్ సమీపంలో నిర్మించిన జలాశయంలో ఎత్తిపోసేందుకు నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ నెల 16న రేపు అపర భగీరథుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *