దిగబడిన లారీలు నిలిచి పోయిన వాహనాలు
వెంకటాపురం, సెప్టెంబర్ 09
ములుగు జిల్లాలో ఇసుక లారీలతో ప్రయాణికులు వాహన దారులు రోడ్డు పై ప్రయాణం చేయాలంటే ప్రాణాలను గుపెట్లో పెట్టుకొని వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. నుగుర్ వెంకటాపురం మండలం పాత్రపురంలో గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఇసుక లారీలు అధిక లోడ్ తిరగడం వల్ల రోడ్డు ద్వాంసం అయి రోడ్డు పై నీళ్లు నిలిచి రెండు ఇసుక లారీలు పక్క పక్కనే దిగపడి ట్రాఫిక్ నిలిచి పోయి అత్యవసర 108 వాహనం కూడ పోవడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడింది దింతో భద్రాచలం వాజేడు వెళ్లే వాహనాలు నిలిచి పోయి ప్రయాణికులు వాహన దారులు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు.