ప్రాంతీయం

వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

75 Views

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం శ్రీ కృష్ణాష్టమి పురస్కరించుకొని ఆలయ అధ్యక్షులు బుక్క రమేష్ విరిజ దంపతుల ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాధాకృష్ణ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు పెద్ద ఎత్తున భజనలు కీర్తనలు పాటలతో వెంకటేశ్వర ఆలయం ప్రాంగణం మారుమ్రోగింది. ఈ సందర్భంగా వేంకటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ బుక్క రమేష్ మాట్లాడుతు శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా ఆలయంలో విశేష పూజలు నిర్వహించి భజన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, శ్రీకృష్ణుని బోధనలు గొప్పవని ప్రతి ఒక్కరూ దైవ భక్తి కలిగి ఉండాలని లోక కళ్యాణం కోసం శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత ప్రతి ఒక్కరూ చదవాలని అన్నారు. శ్రీ కృష్ణాష్టమి ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *