పేదింటి వివాహిత పెళ్లికి వస్తువులు అందజేసిన రజక సంఘం నాయకులు
జగదేవ్ పూర్: కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామానికి చెందిన ఓ పేదింటి పెళ్లి కూతురు వివాహానికి జగదేవ్ పూర్, గజ్వేల్ మండలాలకు చెందిన రజక సంఘం నాయకులు ఉచితంగా పెళ్లి వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా దుద్దెడ గ్రామానికి చెందిన బస్వరాజు యాదగిరి-లక్ష్మీ నర్సవ్వల కూతురు రేణుక పెళ్లి సందర్భంగా మంగళవారం జగదేవ్ పూర్ మండల రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్, గజ్వేల్ మండలం ప్రెజ్ఞాపూర్ గ్రామానికి చెందిన రజక సంఘం నాయకులు మెతుకు నర్సింలు, జగదేవపూర్ మండల రజక సంఘం గౌరవ అధ్యక్షులు అక్కారం నరసింహులుbరిటైర్డ్ ఆర్ టిసి డ్రైవర్ రాములు, పోలీస్ కానిస్టేబుల్ వీణలు కలిసి రూ.40000ల విలువైన బీరువా, మంచం, డ్రెస్సింగ్ టేబుల్, రెండు కుర్చీలు పెళ్లి కూతురు రేణుక కు అందజేశారు. అనంతరం రజక సంఘం అధ్యక్షుడు ఎల్లేష్ మాట్లాడుతూ సామాజిక రంగాల్లో సేవ చేయడం మనిషి జీవితంలో ఎంతో మానసిక ఆనందాన్ని ఇస్తుందన్నారు. మన సంపాదనలో కొంత సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తే మన జీవితాలకు సార్ఠకత ఏర్పడుతుందని పేర్కొన్నారు. సమాజంలో ఎంతో మంది నిరుపేదలు వివిధ సమస్యలతో బాదపడుతున్నారని వారిని మానవతావాదులు





