అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుంది ఎమ్మెల్యే కె పి వివేకానంద్…
*అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఫోరమ్ నుతన కమిటీ ఆత్మీయ సన్మాన సభలో పాల్గొన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 డివిజన్ జీడిమెట్ల పరిధిలోని సరోజినీ గార్డెన్స్ లో నూతనంగా ఎన్నికైన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఫోరమ్ ఆత్మీయ సన్మాన సభలో ఈ రోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారు ముఖ్య అథిది గా పాల్గొని జ్యోతి ప్రజ్వలించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు గౌరవ వేతనం ను పెంపొందించాలని మరియు వారిని క్రమబద్దీకరించేలా కృషి చేయాలనీ ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారికి వినతి పత్రం అందించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గతంలో 4వేలు ఉన్న వేతనాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ గుర్తించి 13,650 కి పెంచారు. ఇప్పుడు మీ ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అల్ ఫోరమ్ ప్రెసిడెంట్ రవి ప్రకాష్, స్టేట్ కన్వీనర్ నిర్మల, స్టేట్ ఈ సి మెంబర్ ఈశ్వర్, డిస్ట్రిక్ట్ సెక్రెటారీ భరత్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కె సుజాత, సెక్రటరీ జె జామున, వైస్ ప్రెసిడెంట్ నాగరాణి, కౌశాధికారి పి పద్మలత, తదితరులు పాల్గొన్నారు.





