తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన ఎంపిటిసి పుప్పాల కనకయ్య కుమారుడు శ్రీకాంత్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.ఆ కుటుంబాన్ని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానకొండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డా. కవ్వంపల్లి సత్యనారాయణ సోమవారం పరామర్శించి తమ సంతాపం వ్యక్తం చేశారు.మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.పరామర్శించిన వారిలో సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్, దుంబాల నరసయ్య, యాళ్ల సుధాకర్ రెడ్డి, యాళ్ల కనుక రెడ్డి, పుల్లెల స్వామి, కోమటి కొమురయ్య, చెన్నడి రవీందర్ రెడ్డి, ఎడ్ల మల్లయ్య, దుంబాల శ్రీను, సానగొండ రాములు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




