*అక్టోబరులో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్!*
*తెదీలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తుడిసెంబరు రెండో వారంలోగా పోలింగ్ ముగించే దిశగా యోచన*
*ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారాను మోగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం అవుతోంది.*
ఎన్నికలకు ముహూర్తాన్ని ఖరారు చేసేందుకు విస్తృత కసరత్తు చేపట్టింది. అక్టోబరు రెండో వారంలోగా షెడ్యూల్‌ను ప్రకటించాలని యోచిస్తోంది. ఎన్నికల సన్నద్ధతపై అధ్యయనం చేసేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల బృందం రాష్ట్రానికి రానుంది. అక్టోబరు మొదటి వారంలో వచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఇంతక్రితం గడువుకు ముందుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయటంతో 2018 అక్టోబరు 6న షెడ్యూల్ వచ్చింది. డిసెంబరు 7న పోలింగు జరిగింది. జనవరి 17న అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమేరకు రాష్ట్ర అసెంబ్లీ ప్రస్తుత గడువు వచ్చే ఏడాది జనవరి 16 వరకు ఉంది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఇదే గడువు. మిజోరం అసెంబ్లీ గడువు మాత్రం ఈ ఏడాది డిసెంబరు 17తో ముగియనుంది. తెలంగాణతోపాటు మిగిలిన నాలుగు రాష్ట్రాలకు ఒకే దఫా షెడ్యూలు
