*బీజేపీ నేతల అరెస్ట్.*
మెదక్ జిల్లా :సెప్టెంబర్ 01
కామారెడ్డి నియోజకవర్గ బిజెపి ఇన్చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి శుక్రవారం తలపెట్టిన చలో గజ్వేల్ కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలు నాయకులను పోలీసులు అడ్డుకున్నారు బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఇంటి వద్దకు బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.
దీంతో రమణారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది భారీ బందోబస్తు మధ్యలో పలువురు బీజేపీ నాయకులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
