*నేడు ముంబైలో ఇండియా కూటమి సమావేశం..*
ముంబాయి: భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్లో భేటీ కానుంది. ఈ సమావేశంలో 28 బీజేపీ యేతర పార్టీలు పాల్గొనున్నాయి.
ఈ భేటీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన 11 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. గురువారం ప్రతిపక్ష పార్టీలు పోల్ మోడ్లోకి రావాలని, 2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని యడిఎని ఎదుర్కోవడానికి తమ ప్రణాళికలను వేగవంతం చేయాలని నిర్ణయించుకున్నాయి. మరికొందరు అగ్రనేతలు సీట్ల పంపకాలను ఖరారు చేసి కొన్ని వారాల్లో ఉమ్మడి ఎజెండాతో ముందుకు రావాలని భావిస్తున్నారు. I.N.D.I.A. బ్లాక్ దాని లోగోను శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఆవిష్కరించే అవకాశం ఉంది.





