-పట్టుకొని దేహశుద్ధి చేసిన స్థానికులు
ఆటోలో ప్రయాణిస్తున్న ఓ విద్యార్ధిని మెడలో నుండి ఆదే ఆటోలో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి విద్యార్ధిని మెడాలో నుండి బంగారు గొలుసును అపహరించుకొని పరరైతుండగా స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అలుగునూర్ శివారు చేపల కాలనీ వద్ద రాజీవ్ రహదారిపై బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, ఎల్ఎండి పోలీసులు | తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తన అప్పి అటోలో ప్రయాణికులతో కరీంనగర్ నుండి తిమ్మాపూర్ వస్తుండగా చేపల కాలనీ వద్ద ఓ ఆటోలొ ఉన్న ఓ మహిళ(ప్యాసింజర్) దిగుతున్న క్రమంలో ఆటోలో ఉన్న తిమ్మాపూరికి చెందిన ఓ విద్యార్ధిని మధన సంధ్య కూర్చోని ఉంది. అయితే ఆటోలో వెనుక కూర్చున్న నిషాని నరేష్ అనే వ్యక్తి సంద్య మెడలో నుండి బంగారు గోలుసు తెంపుకొని ఆటోలో నుండి దూకి పారిపోతుండగా విద్యార్థిని కెకాలు వేయడంతో స్థానికులు గమనించి పారిపోతున్న దొంగను వెంబడించి పట్టుకొని దేహశుద్ధి చేసి ఎల్ఎండి పోలీస్ స్టేషన్కు తరలించి పోలీసులకు అప్పగించారు. నిందితుడు కరీంనగర్ లోని ఓ జనరల్ స్టోర్లో పని చేసి తిరిగి ఇంటికి వెళుతు ఈ దొం గతానికి పల్పడ్డాడు. భాదితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నాట్లు ఎల్ఎండి ఎస్సై ప్రమోద్ రెడ్డి తెలిపారు.