Breaking News

మదర్ థెరిస్సా జన్మదినం సందర్భంగా నగునూరి కి సన్మానం

82 Views

మదర్రిస్సా జన్మదినం సందర్భంగా నగునూరి కి సన్మానం
ఆపదలో ఉన్న ఎంతోమందిని అక్కున చేర్చుకున్న మానవతా మూర్తి మదర్ థెరిస్సా గారి పుట్టినరోజు సందర్భంగా లయన్స్ క్లబ్ కరీంనగర్ ఆఫ్ శాతవాహన అధ్యక్షుడు లయన్ యాదగిరి శేఖర్ రావు సామాజిక సేవలో భాగముగా ప్రత్యేకంగా సమయములో దాదాపు రెండు లక్షల మందికి ఉచిత భోజనం అందించిన వారి కోసం మీకోసం మేము ఉచితంగా భోజనం చేసినందుకు మీకోసం మేము అందిస్తున్నాము సంస్థ అద్యక్షుడు నగునూరి రాజేందర్ గారిని ఘనముగా సన్మానించడం జరిగింది..
అనంతరం నగునూరి రాజేందర్ మాట్లాడుతూ ఎక్కడో యుగోస్లేవియా లో పుట్టి కలకత్తా మురికవాడల్లో అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి , తోటవారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్న వారిని వెతికి మరీ సాయం చేసి అమ్మగా మారింది,
భారతీయులతో అమ్మ అని పిలిపించుకున్న గొప్ప వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా నేను చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి నన్ను సన్మానించడం చాల సంతోషముగా ఉందని తెలుపుతూ ఈ కార్యక్రమాలను కొనసాగిస్తానని తెలిపారు.. ఈ
కార్యక్రమంలో లయన్ మెచినేని సత్యనారాయణ, లయన్ డా. ఎల్లాల లక్ష్మారెడ్డి,
లయన్ కోట సత్యం మరియు మేమున్నాం మీకోసం సంస్థ ప్రతినిధి రాకేశ్ కుమార్ ఉన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *