Breaking News

విజేత కళాశాల యజమాన్యం పై క్రిమినల్ కేసులు పెట్టాలి*  *పర్మిషన్ లేకుండా విద్యార్థుల నుంచి సర్టిఫికెట్ల సేకరణ*

71 Views

*విజేత కళాశాల యజమాన్యం పై క్రిమినల్ కేసులు పెట్టాలి*

*పర్మిషన్ లేకుండా విద్యార్థుల నుంచి సర్టిఫికెట్ల సేకరణ*

 

*వేరే కాలేజీలకు సర్టిఫికెట్లు అమ్ముకుంటున్న విజేత యాజమాన్యం*

 

*ఫ్లెక్సీలు తొలగించిన ఏ.ఐ.ఎస్.బి నాయకులు*

 

*విద్యార్ధి సంఘా నాయకులతో దురుసుగా ప్రవర్తించిన ప్రిన్సిపాల్*

 

*ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు*

 

చేర్యాల: మండల కేంద్రంలో ఉన్నటువంటి విజేత జూనియర్ కళాశాల యాజమాన్యం ఇలాంటి పర్మిషన్ లేకుండా విద్యార్థుల దగ్గర సర్టిఫికెట్లు సేకరించి, వేరే కళాశాలకు సర్టిఫికెట్లు అమ్ముతున్నటువంటి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు అన్నారు.

ఈ విషయమై జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు మాట్లాడుతూ…. విద్యార్థులను వారి తల్లితండ్రులను మాయమాటలతో నమ్మించి మొదటి సంవత్సరం పూర్తి కాగానే సర్టిఫికెట్లను వేరే కళశాలలకు అమ్ముకుంటూ, విద్యార్థులు టీసీలు అడుగుతే అధిక మొత్తంలో డబ్బులు దండుకుంటూ విచ్చలవిడిగా విద్య వ్యాపారం చేస్తున్నారని,

ఇది ఏంటని ప్రశ్నించిన ఏఐఎస్బి నాయకులతో దురుసుగా ప్రవర్తిస్తూ, బూతులు మాట్లాడుతూ ఏం చేసుకుంటారో చేసుకోమని బదిలీస్తున్నాడని వారు అన్నారు. ఇంతవరకు విజేత కళాశాలకు ఎటువంటి పర్మిషన్ లేకుండా సర్టిఫికెట్లు సేకరించి తిరిగి సర్టిఫికెట్లు అడుగుతే విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇలాంటి యాజమాన్యంపై వెంటనే క్రిమినల్ కేసులు పెట్టి, విద్యార్థుల సర్టిఫికెట్లు తిరిగి వారికి ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల అధికారుల కార్యాలయాలు ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చేర్యాల మండల అధ్యక్షులు ఆత్మకూరి హరికృష్ణ, మద్దూరు మండల అధ్యక్షుడు వెల్దీ సాయికిరణ్ రెడ్డి, మండల నాయకులు ఎర్ర సంతోష్, స్వామి, వేణు, అజయ్ కుమార్, శ్రీనివాస్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *