**ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాల వితరణ*
ప్రాథమిక పాఠశాల, మర్కు క్ లో స్థానిక సర్పంచ్ శ్రీ అచ్చం గారి భాస్కర్ విద్యార్థినీ విద్యార్థులకు 500 నోటు పుస్తకాలను వితరణ చేశారు. గ్రామ సర్పంచ్ గా గ్రామాభివృద్ధికి కృషి చేస్తూ పాఠశాలలోని పేద విద్యార్థులందరికీ నోటు పుస్తకాలను సర్పంచ్ గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పిల్లలు దూరం కావద్దని, విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని పిల్లలు చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకోవాలని తెలియజేశారు విద్యాభివృద్ధికి తనకు తోచిన సాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటానని తెలియజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాణి ఉపాధ్యాయురాలు కవిత విద్యార్థులు పాల్గొన్నారు
