బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్, కోవర్ట్ లో అందోళన
తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు సీఎం కేసీఆర్ త్వరలో జరగబోయే ఎన్నికలకు ఎమ్మేల్యే అభ్యర్థుల జాబితా విడుదల సందర్భంగా మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా మరొకసారి రాష్ట్ర సంస్కృతక సారధి చైర్మన్,ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ కి అవకాశం కల్పించిన శుభ సందర్భంగా తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు రావుల రమేష్ తో పాటు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టి శ్రేణులు క్యాంపు కార్యాలయనికి చేరుకొని రసమయి బాలకిషన్ కి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా చౌరస్తాలో పెద్ద ఎత్తున టపాసులు పేల్చుతూ జనాలకు స్వీట్లు పంపిణీ చేశారు.
అనంతరం రావుల రమేష్ మాట్లాడుతూ మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ రసమయి బాలకిషన్ కి మూడోసారి అవకాశం ఇచ్చిన శుభ సందర్భంగా సీఎం కేసీఆర్ కి, కేటిఆర్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్త గెలుపే లక్ష్యంగా పనిచేస్తూ మానకొండూరు గడ్డపై మూడోసారి బిఆర్ఎస్ జెండా ఎగురవేస్తూ ఎమ్మెల్యే ని లక్ష మెజార్టీతో గెలిపించి రసమయి బాలకిషన్ ని మంత్రి చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, సల్ల రవి,పాశం అశోక్ రెడ్డి,కవ్వంపల్లి పద్మ,మెంగని రమేష్,పింగీలి నరేందర్ రెడ్డి, వంతడుపుల సంపత్, గంగిపెల్లి సంపత్,నార్ల అశోక్,పెట్టం రమేష్,పొన్నంఅనిల్ పార్నాంది జలపతి ఖమ్మం కృష్ణ,ఎల్క ఆంజనేయులు,ల్యాగల దేవేందర్ రెడ్డి,తుర్పటి అజయ్, తాళ్లపల్లి నందకిషోర్,ఎండీ రఫీ,అల్వాల సంపత్ ఉప్పులేటి శంకర్,ఆంజనేయులు,కిన్నెర అంజి,అలువాల సంపత్,కొమ్ము సంపత్,గాజా సాగర్,గొస్కి శ్రీనివాస్,అసోధ శ్రీనివాస్,అసంపెల్లి అశోక్, సముద్రాల మల్లేష్,ఎల్కపెల్లి పర్షారములు,లక్ష్మణ్,మేకల సునీల్,ఎనగందుల సతీష్, భామండ్ల మల్లేష్,తదితరులు పాల్గొన్నారు




