*వృద్ధ దంపతుల ప్రాణం తీసిన ఫీటున్నర జాగ.. ఛీ వీడసలు కొడుకేనా.?*
సిరిసిల్ల: ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఆస్తులకు ఇచ్చే విలువ బంధాలు బంధుత్వాలకు ఇవ్వటం లేదు అనుబంధాలు అనురాగాలు ఆత్మీయతలు కేవలం భ్రమగానే మిలిగిపోతున్నాయి. అవన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆశిరెడ్డిపల్లిలో విషాదఘటన చోటు చేసికుంది ఓ ఫీటున్నర జాగా ( 18 ఇంచుల స్థలం) వృద్ధ దంపతుల ప్రాణం తీసింది ఆస్తి పంపకాల్లో భాగంగా ఆ జాగ కోసం పెద్ద కొడుకు వేధింపులకు పాల్పడటంతో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు దీంతో వారిని ఒకే చితిపై ఉంచి దహన సంస్కారాలు నిర్వహించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కనికరపు దేవయ్య (69) లక్ష్మీనర్సవ్వ (60) దంపతులు వీరికి ఇద్దరు కుమారులు కూతురు ఉన్నారు అందరికీ పెళ్లిళ్లు చేయగా ఎవరికి కుటుంబం వారికి ఏర్పడింది అయితే దేవయ్య పాత ఇంటి వెనకాల ఉన్న ఖాళీ స్థలంలో పెద్ద కుమారుడు ఇల్లు కట్టుకుంటున్నాడు ఆస్తి పంపకాల్లో భాగంగా పెద్ద కొడుక్కి పాత ఇంట్లోని 18 ఇంచుల జాగ ఇచ్చేది ఉంది దీంతో ఇల్లు కూల్చి తనకు రావాల్సిన జాగా ఇవ్వాలని నిత్యం వేధింపులకు గురి చేసేవాడు ఈ విషయమై శనివారం (ఆగస్టు 19) తల్లి దండ్రులతో గొడవ పడ్డాడు ఆదివారం ఇంట్లో నుంచి మల్లన్న దేవుడిని తీసుకెళ్తామని ఇల్లు కూల్చి తనకు రావాల్సిన జాగా ఇవ్వాల్సిందేనని తల్లి దండ్రులను హెచ్చరించాడు
కొడుకు వేధింపులతో వృద్ధ దంపతులు మనస్థాపం చెందారు పిల్లల్ని పెంచి పోషించి ఇంతటి వారిని చేస్తే అడుగున్నర జాగా కోసం తమను వేధింపులకు గురి చేయటం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఇక తాము బ్రతికుండటం వ్యర్థమనుకున్నారు శనివారం రాత్రే ఇంట్లో పురుగుల మందు తాగి దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు ఉదయమైన ఇంటి తలుపులు తెరవకపోటవంతో ఇరుగుపొరుగు వాళ్లు ఇంట్లోకి వెళ్లి చూడగా వారు అప్పటికే విగతజీవులై పడి ఉన్నారు ఈ విషయాన్ని చిన్న కుమారుడుకి తెలియజేశారు అతడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా గ్రామానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు చిన్న కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పెద్ద కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు పోస్టుమార్టం తర్వాత ఆదివారం మృతదేహాలు స్వగ్రామానికి తీసుకురాగా గ్రామ పెద్దలు చిన్న కొడుకును కాదని కూతురుతో అంత్యక్రియలు పూర్తి చేయించారు.





