బిల్వ వృక్షాన్ని డాక్టర్ జి సత్యనారాయణ స్వామి గారికి అందజేసిన సామాజిక కార్యకర్త జగన్ కోటారి
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కార్పొరేట్ హాస్పిటలకు దీటుగా, కార్పొరేట్ సౌకర్యాలతో, గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన అశ్విని హాస్పిటల్ వ్యవస్థాపకుడైన నిరుపేదల ఆశాజ్యోతి, నిస్వార్ధపరులు, దైవ సమానులు డాక్టర్ జి సత్యనారాయణ స్వామి గారికి బిల్వ వృక్షాన్ని అందజేసిన సామాజిక కార్యకర్త జగన్ కోటారి, సీనియర్ జర్నలిస్ట్ బండారు బాల్రెడ్డి, బెస్త నరేష్ ఉన్నారుమారేడు లేదా బిల్వము హిందూ దేవతలలో ఒకడైన శివపూజలో ముఖ్యం. * శివుని బిల్వ పత్రములతో పూజించుట శ్రేష్టము. బిల్వ వృక్షము సాక్షాత్తు శివస్వరూపమని దేవతలు భావించెదరు. శివపురాణంలో బిల్వపత్రం మహిమను తెలిపే కథ ఉంది.
