అవినీతికి అడ్డా డిసిసి బ్యాంక్ చేర్యాల
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి
సెప్టెంబర్ 12 సిద్దిపేట జిల్లా
సిద్దిపేట జిల్లా చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కత్తుల వెంకటవ్వ భర్త పేరు కత్తుల జగనాదం 2015 సంవత్సరంలో క్రాప్ లోన్ తీసుకోవడం జరిగింది మళ్లీ తిరిగి చెల్లించడం జరిగింది తర్వాత తిరిగి మళ్ళీ అమౌంటు వేయడం జరిగింది
గతంలో చెల్లించినప్పటికీ మళ్లీ ఒక లక్ష 96,000 చెల్లించమని చెప్పడం జరుగుతుంది గతంలో చెల్లించిన రసీదులు ఉన్నప్పటికీ మా దగ్గర అందుబాటులో లేవని సమాధానం చెబుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంతేగాక గత నెల రోజుల నుంచి బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేసిన కనీసం చూడడం లేదు ఏమైనా అంటే రేపు రా, మాపుర అంటూ తెంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సీఈఓ ను సస్పెండ్ చేయాలని గతంలో కూడా ఇటువంటి అక్రమాలు జరిగాయని అయినప్పటికీ తీరు పద్ధతి మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు
లేనియెడల ప్రజలంతా ఏకం చేసి బ్యాంకు ముందు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు
