*మర్కూక్ తహసీల్దారును కలిసిన బిఆర్ఎస్ నాయకులు*
*ఈ రోజు మర్కుక్ మండల నూతన తహసీల్దార్ చంద్రశేఖర్ ను సేవా రత్న అవార్డు గ్రహీత ముదిరాజ్ మహా సభ జిల్లా ఉపాధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్, బీఆర్ఎస్ రాష్ట్ర యూత్ వింగ్ నాయకులు సంతోష్ రెడ్డి,పాతూర్ బిఆర్ఎస్ గ్రామ శాఖ మల్లేశ్ ముదిరాజ్ గార్లు మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి స్వాగతం తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రెవిన్యూ పరమైన సమస్యలు జాప్యం చేయకుండా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేదిగా ఉండాలని ఎల్లప్పుడూ మా సహకారం ఉంటుందని అన్నారు.*
