D.01-8-2023 గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గజ్వేల్ ప్రజాసంఘాల డిమాండ్
గ్రామపంచాయతీ కార్మికుల వేతనాల పెంపు కోసం వచ్చిన జీవో నెంబర్ 60ని పకడ్బందీగా అమలు చేసి కార్మికులపై పని భారం పెంచే జీవో నెంబర్ 51 మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని
కనీస వేతనం ఇవ్వాలని గ్రామపంచాయతీ జేఏసీని చర్చలకు పిలిచి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ గజ్వేల్ లోని ఐఓసీ దగ్గర సమ్మె చేస్తున్న జిపి కార్మికులకు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ పోలీస్ బ్యూరో సభ్యులు మైసరాములు..మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి.. సాహసం జిల్లా అధ్యక్షులు కొడకండ్ల నర్సింలు.. తెలంగాణ అంబేద్కర్ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిప్పల యాదగిరి గారు మాట్లాడుతూ 27రోజులుగా జిపి కార్మికులు సమ్మెలో ఉంటే ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తునదని అన్నారు. కార్మికులను పర్మినెంట్ చేయాలని వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు గతంలో అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఎండా వాన చలిలో కష్టపడి పల్లెల్లో ప్రజలకు ప్రత్యక్ష సేవలందిస్తున్న పంచాయతీ కార్మికుల అత్యధికులు దళితులు కావడం వల్లే ప్రభుత్వం వివక్ష పాటిస్తుందన్నారు జీవో నెంబర్ 51 ద్వారా మల్టీపర్పస్ విధానాన్ని తీసుకొచ్చి కార్మికులకు పని భారాన్ని పెంచడం సరైంది కాదన్నారు వేతనాలు పెంచమంటే పని భారం పెంచుతారా అని ప్రశ్నించారు ప్రమాదవశాత్తు కార్మికులు మరణించిన కనీస ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం ఇవ్వలేకపోవడం దారుణం అన్నారు కనీస ప్రాథమిక హక్కుగా పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం లేకపోవడం అన్యాయమన్నారు కరోనా వంటి కష్టకాలాల్లో ప్రజలని తమ ప్రాణాల్ని ఫణంగా పెట్టి ఆదుకున్న పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం సరైనది కాదన్నారు కేంద్ర బిజెపి సర్కార్ నేడు టెంట్ల వద్ద మద్దతు ఇచ్చినప్పటికీ అసలు కార్మికుల ప్రాథమిక హక్కులను కాల రాసి కార్పొరేట్లకు ఉపయోగపడే నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి కార్మికుల పొట్టలు కొట్టి కార్పొరేట్లకు మేలు చేస్తుందన్నారు 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచిన ఘనత బిజెపి సర్కార్ దేనని విమర్శించారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జిపి జేఏసీ ని చర్చలకు ఆహ్వానించి సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు అనిల్. రాజయ్య. చంద్రం. యాదగిరి. రాజు. కుమార్. దేవేందర్. మహిళలు రాజమణి రాఘవ బాలమణి తదితరులు పాల్గొన్నారు
