దిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తోన్న కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ టీపీసీసీ ప్రచార కమిటీని నియమించింది. టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ను నియమించిన కాగ్రెస్ అధిష్ఠానం.. కో ఛైర్మన్‌గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్‌గా సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీలను నియమించింది. అలాగే, 37మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఎనిమిది మందిని ప్రత్యేక ఆహ్వానితులగా నియమించింది.
