తెలంగాణ రక్షణ సమితి పార్టీలో చేరికలు
గజ్వేల్ నియోజక వర్గం మర్కుక్ మండల కేంద్రంలో ఆదివారం నాడు తెలంగాణ రక్షణ సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గజ్వేల్ నియోజక వర్గం ఇంచార్జీ సిలివేరి ఇంద్ర గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక యువకులు సుర్వి నాగేంద్రబాబు, సాయి నరేష్ తెలంగాణ రక్షణ సమితి పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా వారికి సిలివేరి ఇంద్ర గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ రక్షణ సమితి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఇంద్ర గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో తెలంగాణ రక్షణ సమితి పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ సమ సమాజ నిర్మాణానికోసం తెలంగాణ రక్షణ సమితి పాటుపడుతుందని,యువత చూపు తెలంగాణ రక్షణ సమితి వైపు ఉందని రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సమితి అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తుందని, గ్రామ గ్రామాన తెలంగాణ రక్షణ సమితి వాటిని తీసుకువెళ్లడం జరుగుతుందని అన్నారు





