ఆర్ అండ్ ఆర్ కాలనీ వేములఘట్ లో ఘనంగా మేడే వేడుకలు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ వేములఘట్ లో సోమవారం మేడే సందర్భంగా సర్పంచ్ సిద్దిపేట బాలయ్య,ఉప సర్పంచ్ బాలకిషన్,ఎంపీటీసీ కల్పన మల్లేష్,బీ ఆర్ ఎస్ నాయకులు సిద్దిపేట ఎల్లం,ప్యాట బాబు అధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు జండా ఆవిష్కరణ అనంతరం స్వీట్స్ పంపిణీ చేసి మేడే ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సందబోయిన ఎల్లయ్య, బండ్ల స్వామి పాల్గొని వారు మాట్లాడుతు కార్మికులు ఐక్యంగా ఉండి హక్కులు పొందాలని ప్రతి ఒక్కరూ కార్మికుల హక్కులు తెలుసుకోవాలని అన్నారు మే డే వేడుకలు ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు నాయిని మల్లారెడ్డి,నర్సింలు, వెములఘట్ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం అధ్యక్షుడు దాతరపల్లి నర్సింలు, ఉపాధ్యక్షులు సోమయ్య, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి, కోశాధికారి సుతారి రాజయ్య, కార్మికులు నాయకులు ఆర్ అండ్ ఆర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు





