*యూసుఫ్ ఖాన్ పల్లి గంగాపూర్ గ్రామాల్లో పర్యటించిన ఎర్రవల్లి ఎంపీటీసీ ధనలక్ష్మి కృష్ణ*
*ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా మంత్రి హరీష్ రావు ఎంపీపీ పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం ఆదేశాల మేరకు ఎర్రవల్లి ఎంపీటీసీ పరిధిలో ఉన్న రెండు గ్రామాలలో స్థానిక ఎంపీటీసీ ధనలక్ష్మి కృష్ణ పర్యటించారు. ఇండ్లు కూలిపోయిన బాధితులతో మాట్లాడుతూ ప్రస్తుతము ప్రభుత్వ భవనాలలో లేదంటే ఎవరైనా ఖాళీ ఇండ్లలో ఉండేలా సర్పంచ్ ప్రసాద్ తో మాట్లాడి సురక్షిత ప్రదేశాలకు చేరుస్తామన్నారు.ఇండ్లు కూలిపోయిన కుటుంబాలకు అధికారులతో మాట్లాడి . గృహలక్ష్మి పథకం కింద ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు.పకృతి వైపరీత్యాలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాచారం కోసం ప్రతినిధులను గ్రామాలలో పర్యటించి వారికి తక్షణ సహాయ సహకారాలు అందివ్వాలనే ఉద్దేశ్యంతోనే నేను గ్రామాలలో పర్యటిస్తున్నానని అన్నారు.వారితో పాటుగా గ్రామస్తులు కూడా పాల్గొన్నారని పేర్కొన్నారు
