వీడియో కోసం వెళ్లి నీటిలో కొట్టుకుపోయాడు(వీడియో)
దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. అయితే ఓ వ్యక్తి వీడియో కోసమని పొంగుతున్న జలపాతం వద్దకు వెళ్లగా కాలు జారి దానిలో కొట్టుకుపోయాడు. ఈ ఘటన కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో గల గుండి జలపాతం వద్ద జరిగింది. ఓ యువకుడు జలపాతం వద్ద బండపై నిల్చొని వీడియో తీసుకుంటుండగా కాలు జారి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.





