Breaking News

తెలంగాణ ప్రభుత్వం అధికార మత్తులో విద్యార్థి నిరుద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలతో విర్రవీగుతున్న అవినీతిమయ ప్రభుత్వంపై నిర్వహిస్తున్న దగాపడ్డ తెలంగాణ విద్యార్థి మార్పు కోసం మహా ఉద్యమం – ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కమల్ సురేష్*.

115 Views

 

 

*తెలంగాణ ప్రభుత్వం అధికార మత్తులో విద్యార్థి నిరుద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలతో విర్రవీగుతున్న అవినీతిమయ ప్రభుత్వంపై నిర్వహిస్తున్న దగాపడ్డ తెలంగాణ విద్యార్థి మార్పు కోసం మహా ఉద్యమం – ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కమల్ సురేష్*.

 

స్థానిక సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్న ప్రెస్ క్లబ్ లో ఏబీవీపీ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కమల్ సురేష్ మాట్లాడుతూ” అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం నేడు అమరుల ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది మరి ముఖ్యంగా విద్యారంగం విధ్వంసం కాబడింది. నిరుద్యోగుల ఆశలు అడియాశలు అయ్యి రోడ్డు పాలు అవుతున్న సందర్భం ఏర్పడింది. నేడు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో బోధన బోధనేతర ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా మౌలిక వసతులు లేక సాక్షాత్తు సీఎం గారి మనవడే మొన్న సీఎం గారి పాలనను బట్టబయలు చేయడం జరిగింది. పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతూ 8624 ప్రభుత్వ పాఠశాలను మూసివేయడం జరిగింది. కాబట్టి వాటిని వెంటనే ప్రారంభించి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఫీజు నియంత్ర చట్టం చేసి ఫీజుల దోపిడిని అరికట్టాలి. అదేవిధంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ 5,300 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. సంక్షేమ వసతి గృహాలకు పక్కాభవనాలు కట్టించి మెరుగైన వసతులు కల్పించాలి. యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి పటిష్టం చేయాలి. రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి. రైతు రుణాలను తక్షణమే మాఫీ చేసి, కల్తీ విత్తనాలు నిరోధించాలి. కాబట్టి పై డిమాండ్ సాధనకై మార్పు కోసం మహా ఉద్యమంలో భాగంగా ఆగస్టు ఒకటిన చలో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో *కదన బేరి* పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతోంది కావున విద్యార్థులు నిరుద్యోగులు, కళాకారులు కార్మికులు, మేధావులు అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఏబీవీపీ కొరుతుంది.ఈ

కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బీరకాయల వివేక్, నగర కార్యదర్శి పవన్, లక్ష్మీపతి, శంకర్, జైయేష్, తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *