కరెంట్ షాక్.. క్షణంలో ప్రాణం పోయింది (వీడియో) మహారాష్ట్రలోని జలగావ్ రైల్వే స్టేషన్లో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. రైల్వేస్టేషన్లోని ప్లాట్ఫారం నంబర్ 4లో ఓ గూడ్స్ రైలు ఉంది. దాని పైకి 50 ఏళ్ల వ్యక్తి ఎక్కి పరిశీలించాడు. అనుకోకుండా రైల్వే విద్యుత్ వైర్లను తాకడంతో కరెంట్ షాక్ కొట్టింది. దీంతో క్షణాల్లోనే ఆ వ్యక్తి చనిపోయి, కింద పడిపోయాడు. మృతుడి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడే కాదు ఎక్కడైనా కరెంటు తీగలు ఉన్నచోట జాగ్రత్త వహించండి. ????
