Breaking News

బోనాల పండుగ సందర్భంగా ఆదివారం 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు బంద్

110 Views

హైదరాబాద్: బోనాల పండుగ సందర్భంగా ఆదివారం 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని సౌత్‌ ఈస్ట్‌, సౌత్‌ వెస్ట్‌ జోన్లు, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని మల్కాజిగిరి జోన్‌(మల్కాజిగిరి, కుషాయిగూడ డివిజన్లు), ఎల్బీనగర్‌ జోన్‌ (వనస్థలిపురం డివిజన్‌), మహేశ్వరం జోన్‌(మహేశ్వరం డివిజన్‌) పరిధిలో ఒక రోజు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆయా కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు.

 

అలాగే సిటీ పోలీస్‌ కమిషనరేట్‌లోని సౌత్‌జోన్‌, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని ఎల్బీనగర్‌ డివిజన్‌ పరిధిలో 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసి వేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనూ ఆంక్షలు ఆదివారం అమల్లో ఉండనున్నాయి.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *