Breaking News

మా ఊర్లో కాంగ్రెస్‌కు ప్రవేశం లేదు.. 7 గ్రామాల్లో వెలసిన హెచ్చరిక బోర్డులు*

108 Views

*మా ఊర్లో కాంగ్రెస్‌కు ప్రవేశం లేదు.. 7 గ్రామాల్లో వెలసిన హెచ్చరిక బోర్డులు*

 

కరీంనగర్‌:-ఉచిత విద్యుత్తుపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు భగ్గుమంటున్నారు. ‘కాంగ్రెస్‌ పార్టీకి మా గ్రామంలో ప్రవేశం లేదు’ అంటూ ఆయా గ్రామాల్లో రైతులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కరీంనగర్‌ జిల్లాలోని కరీంనగర్‌, కొత్తపల్లి మండలాల్లోని పలు గ్రామా ల్లో బుధవారం పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు వెలిశాయి. రైతులే స్వయంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. సాగుకు 3 గంటల విద్యుత్తు సరిపోతుందన్న రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌ నాయకులు తమ గ్రామాల్లోకి రావొద్దని స్పష్టం చేస్తున్నారు.

 

ఈ ఫ్ల్లెక్సీలు మొదట కొత్తపల్లి మండలం చింతకుంట వద్ద కరీంనగర్‌-సిరిసిల్ల ప్రధాన రహదారిపై స్థానిక రైతులు ఏర్పాటు చేశారు. ఇదే స్ఫూర్తితో బద్దిపల్లి, బావుపేట, ఖాజీపూర్‌ గ్రామాల్లో, ఇటు కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని బొమ్మకల్‌, కొత్తపల్లి మండలం కమాన్‌పూర్‌, ఎలగందుల తదితర గ్రామాల్లోనూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇలాంటి ఫ్లెక్సీలు రాష్ట్రమంతటా ఏర్పాటయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి….

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *