Breaking News

మిగిలింది మూడు రోజులే.. ఏప్రిల్ 15 తో గడువు ముగింపు*

116 Views

డిస్కౌంట్ తో వాహనాల ట్రాఫిక్ చలాన్స్ చెల్లించండి*

*మిగిలింది మూడు రోజులే.. ఏప్రిల్ 15 తో గడువు ముగింపు*

*అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి – వి. శేఖర్, యస్. ఐ ఎల్లారెడ్డిపేట్*

వాహనాల పై పెండింగ్ లో వున్న చలాన్స్ పై డిస్కౌంట్ ఈ నెల 15 తో ముగుస్తుండటం తో పెండింగ్ చలాన్స్ వున్న వాహన దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎల్లారెడ్డిపేట్ యస్.ఐ వి. శేఖర్ కోరారు.
ఈ సందర్బంగా యస్. ఐ మాట్లాడుతూ గడువు లోగా చలాన్స్ చెల్లించి ఈ అవకాశం ని సద్వినియోగం చేసుకోవాలని లేకుంటే ఏప్రిల్ 15 తర్వాత పూర్తి పెనాల్టీ తో చెల్లించాల్సి వస్తుంది అని, ఆన్లైన్ లో కూడా చెల్లించే వెసులుబాటు వుంది కాబట్టి మొబైల్ ఫోన్ లో కూడా చెల్లించవచ్చు అని, గడువు ముగిసిన తర్వాత పెనాల్టీ లు అధికంగా వున్న వాహనాలు సీజ్ చేసి పూర్తి పెనాల్టీ చెల్లించిన తర్వాత నే వాహనాన్ని విడుదల చేస్తమని అలాంటి పరిస్థితి రావద్దు అనుకుంటే ఏప్రిల్ 15 లోపు చలాన్స్ చెల్లించాలని తెలిపారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్