ప్రభుత్వ పథకాలను ప్రజలు వినియోగించుకోవాలి జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం వెల్లడి
. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామపంచాయతీ దగ్గర జరిగిన గ్రామ పరిపాలన సభలో జిల్లా వ్యవసాయ అధికారి అబ్జల్ బేగం మాట్లాడుతూ మంగళవారం ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఇందులో భాగంగా గ్రామస్తులు ఉద్దేశించి ఆమె మాట్లాడారు మండల పరిషత్ అభివృద్ధి అధికారి గ్రామ స్పెషల్ ఆఫీసర్ అయిన సత్తయ్య ఆధ్వర్యంలో గ్రామ సభ జరిగింది ఇందులో 138 మంది కొత్తగా రేషన్ కార్డులకు అర్హులుగా గుర్తించారు 2 రేషన్ షాపులలో రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం 165 మంది దరఖాస్తు చేసుకోగా ఆమోదించారు ఇందిరమ్మ భరోసా కింద 38 మందిని లబ్ధిదారులుగా గుర్తించడంతోపాటు ఇంకా కొంతమంది అర్హులు ఉన్నట్లు తేలడంతో దరఖాస్తులు చేసుకున్నారు 470 మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకోగా వారిని అర్హులుగా గుర్తించి పేర్లను చదవడం జరిగింది మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సబేరా బేగం మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారు ఎవరైనా ఉంటే ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డుల జారీ ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు పేద ప్రజల కోసం ఈ 4 పథకాలు తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రామస్తుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు రైతు రుణమాఫీ కింద 400 మంది రైతులు రుణమాఫీ పొందడం జరిగిందని మూడు కోట్ల 60 లక్షల రూపాయల వరకు ఈ గ్రామానికి రుణమాఫీ వర్తించిందని ఎ ఇ ఓ. శ్రీశైలం తెలిపారు కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య గ్రామ కార్యదర్శి జాఫర్ నాయకులు మహేందర్ నిమ్మ నారాయణరెడ్డి దొమ్మాటి రాజు గ్రామస్తులు పాల్గొన్నారు
