వర్గల్ మండల బీజేపీ మరియు బీజేవైమ్ పూర్తి కమిటీ సభ్యుల ఎన్నిక…
నేడు వర్గల్ మండలంలోని సాయిరామ్ ఫంక్షన్ హాల్ లో జరూపుకున్న పూర్తీ కమిటీ సమావేశంలో బీజేపీ మరియు బీజేవైఎం కార్యక్రమాలపై, పార్టీలో వర్గల్ మండల కార్యకర్తలను భాగస్వామ్యం చేయడం జరిగింది.
*ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు, బిజెపి రాష్ట్ర నాయకులు, బిజెపి వర్గల్ మండల ఇన్చార్జి నందన్ గౌడ్ మాట్లాడుతూ కెసిఆర్ వర్గల్ మండలంలో పేదల భూములను గుంజుకోని బినామీలతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు అని అన్నారు.బిజెపి నాయకులు అందరం కలిసి ఉమ్మడిగా కష్టపడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని కార్యకర్తలకు దిశా నిదేశం చేయడం జరిగింది.
*బీజేవైఎం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, బిజెపి వర్గల్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ పలు ఉద్యమాలలో భారతీయ జనతా పార్టీకి వెన్నుముక్కగా భారతీయ జనతా యువమోర్చా నిలిచింది, ఈ నిజాం నిరంకుశ, అవినీతి కుటుంబ పాలనను అంతమొందించేది భారతీయ జనతా పార్టీని అని తెలిపారు, కెసిఆర్ నువ్వు గజ్వేల్ నుంచి గెలిపించి పంపిస్తే గజ్వేల్ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు గజ్వేల్ నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా కెసిఆర్ మోసం చేస్తుండు అని అన్నారు.
ఈ కార్యక్రమం లో బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ మన్నే శేఖర్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి పంపరి రమేష్, బిజెపి మండల ఉపాధ్యక్షులు ప్రదీప్ గౌడ్,
బీజేవైమ్అధ్యక్షులు రవిందర్ గౌడ్, బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు మధు, కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి దిండి నాగరాజ్, కిసాన్ మోర్చా మండల ఉపాధ్యక్షుడు యశ్వంత్ రెడ్డి, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.