డిసిఎం వ్యాన్ ఢీకొట్టిన సంఘటనలో గాయపడిన వ్యక్తి
మృతి…
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సమీపంలోని సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై డీసీఎం వ్యాన్ డీ కొట్టిన సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మీసం లక్ష్మన్ బుధవారం సాయంత్రం మరణించారు,
రాగట్ల పల్లి వైపు ఏపీ 15 బిబి 55 46 నెంబర్ గల స్కూటీ పై వెళ్తున్న డయాల్ సిస్ పేసెంట్ మీసం లక్ష్మణ్ (58 ) ను ఎల్లారెడ్డిపేట వైపు అతివేగంగా అజాగ్రత్తగా నడుపుతున్న ఎపి వి 61 39 నెంబర్ గల డిసిఎం వ్యాన్ డ్రైవర్ మంగళవారం తేది 16-05-2023 న డీ కొట్టాడు , ఈ సంఘటనలో లక్ష్మన్ ఎడమ చేయి కుడి కాలు విరిగింది తలకు బలమైన గాయాలయ్యాయి, అతన్ని సిరిసిల్ల , కరీంనగర్ , హైదరాబాద్ లోని వివిధ ఆసుపత్రులకు చికిత్స కోసం తిప్పారు , డయాలసిస్ పేసెంట్ కావడంతో పరిస్థితి మరింత విషమించడంతో అతని బాడీ వైద్యం చేయడానికి సహకరించకపోవడంతో వైద్యులు చికిత్స చేయడానికి నిరాకరించడంతో అతని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు లక్ష్మన్ ను ఇంటికి తెచ్చారు ,
బుధవారం సాయంత్రం లక్ష్మన్ తుదిశ్వాస విడిచారు,
ఆయన కు స్థానిక గిద్ద చెరువు సన్మానవాటికలో గురువారం మధ్యాహ్నం లోగా అంత్యక్రియలు నిర్వహించడానికి ఆయన కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఏర్పాట్లు చేస్తున్నారు,
ఎల్లారెడ్డిపేట పోలీసులు డిసిఎం వ్యాన్ డ్రైవర్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు,




