గ్రామము :ఇప్పలగూడెం
మర్కూక్, మార్చి25
మర్కూక్ మండలం ఇప్పలగూడెం గ్రామంలో ఎస్సీ కాలనీలో మురికి కాల్వలు, సీసీ రోడ్లు అధ్వాన్నంగా తయారు అయ్యాయి. సీసీ రోడ్లు ధ్వంసమైన పట్టించుకోవడం లేదు. దీంతో కాలనీ వాసులు పలు ఇబ్బందులు పడుతున్నారు. పలుసార్లు గ్రామ ప్రజాప్రతినిధులకు, గ్రామ కార్యదర్శికి చెప్పిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా గ్రామంలో మిగతా కాలనీలో సీసీ రోడ్లు వేశారని , ఇక్కడ మరిచారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.






