ప్రాంతీయం

ఆయుష్ ఆధ్వర్యంలో బాలికల పాఠశాలలో యోగ శిక్షణ కార్యక్రమం

156 Views

మంచిర్యాల జిల్లా, కాసిపేట మండలం, దేవపూర్లో

విద్యార్థులకు జీవితంలో యోగ సాధన వలన, మానసిక ప్రశాంతతకు మరియు చదువుపై శ్రద్ధకు వహించుటకు యోగ సాధన ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయుష్ జిల్లా డీపీఎం రవి రాథోడ్ అన్నారు. శుక్రవారం ఆయుష్ ఆధ్వర్యంలో కాసిపేట మండలంలోని దేవపూర్ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో 3 నుంచి 9 తరగతి విద్యార్థినిలకు యోగ శిక్షణ అందించారు. యోగ శిక్షకులు నాగార్జున మరియు గీతదేవి విద్యార్థులతో ఆసనాలు,ప్రాణాయామం చేయించారు.చదువుపై ఏకాగ్రతకు యోగ సాధన ఒక దివ్యఔషధంగా పని చేస్తుంది అని యోగ శిక్షకులు తెలియజేశారు.

ఈ యోగ కార్యక్రమంలో హెచ్.ఎం గోపాల్ ,పీడీ గంగా భవాని, టీచర్ శంకర్ మరియు విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్