రాజకీయం

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సెస్ ఎలక్షన్ లో నువ్వా నేనా …!!

130 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో  బీఆర్ఎస్ హవా కనిపించటం లేదు నాలుగు పార్టీల జోరులో బిజెపి కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నట్లుగా హస్తం, కమలం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో సెస్ ఎన్నికల హంగామా మొదలై వారం రోజులు గడుస్తుంది మరో రెండు రోజుల్లో ఎన్నికలు సమీపించనున్న నేపథ్యంలో బిఆర్ఎస్ కార్యకర్తల్లో తీవ్ర నిరుత్సాహం మొదలైంది. కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు నిరుత్సాహంగా ఉన్నారు మరి కొంతమంది ఆశావాహులు అడ్డగోలుగా జేబులు నింపుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది !కనీసం మూడో స్థానం అయినా వస్తుందా అని బీఆర్ఎస్ నాయకుల్లో కలవరం మొదలైందని విశ్వసనీయంగా తెలిసింది.ప్రజా సమస్యలపై పోరాడుతూ నిరంతరం ప్రజల్లో ఉంటున్న భాజపా , కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా మంత్రి కేటీఆర్ కు కంచుకోటగా ఉన్న సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ పార్టీ నుండి బిజెపి తీర్థం పుచ్చుకుంటున్నారని ఇదివరకే పలు వర్గాలు పేర్కొన్నాయి . ఇదే భయంతో రాజన్న జిల్లాకు మాత్రమే రైతుబంధు డబ్బులు బీఆర్ఎస్ పార్టీ మంజూరు చేసింది మిగతా జిల్లాలకు ఏ కరువైంది. ఎన్నికల నేపథ్యంలోనే ఓట్లు దండుకునే ప్రయత్నంలో ఉన్నారని ప్రతిపక్ష పార్టీలు పేర్కొన్నాయి. ఒక ఓటర్ కు డబ్బులు లేదా మద్యం పంపిణీ జోరుగా కొనసాగుతుందని ఇరు వర్గాల ప్రజలు విమర్శలు చేసుకుంటున్నారు. సెస్ ఎన్నికల్లో కోట్ల రూపాయల కుంభ కోణం ఉన్నాయని మరోసారి గెలిపిస్తే మరిన్ని నిధులు కాల్చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని ఇరువురు చెవులు కొరుక్కుంటున్నారు ఊహించిన స్థాయికి చేరతామా లేదా అని సందిగ్ధంతో ఉన్నట్లు తెలుస్తుంది సరైన అభ్యర్థిని నిలపలేదని కొందరు అభిప్రాయపడుతుంటే కారు గుర్తు లేకపోవడం వల్ల బీఆర్ఎస్ కార్యకర్తలకు నిరాశే ఎదురయ్యేట్లు కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రచారం ఒక్కరోజే ఉండడంతో ఓటుకు నోటు అనే నిదానంతో వెళ్తున్నట్టున్నారు గుర్తుచప్పుడు కాకుండా మధ్యము డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు వార్డుల వారిగా ఏజెంట్లను నిలిపి కాన్వసింగ్ చేస్తున్నారు ఎన్నికల ప్రక్రియలో ప్రజల తీర్పు ఎలా ఉంటుందో మరో మూడు రోజులల్లో భవితవ్యం తేలనుంది

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7