ప్రాంతీయం

గుగ్గిళ్ల గ్రామసభలో పలు సమస్యలపై చర్చ

9 Views

గుగ్గిళ్ల గ్రామసభలో పలు సమస్యలపై చర్చ

కోళ్ల ఫారం అనుమతులు రద్దు చేయాలని గ్రామస్తుల డిమాండ్,

బెజ్జంకి,ఆగష్టు 15, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పోషకాహారం, జల్‌ జీవన్‌ మిషన్‌, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కార్యక్రమాల అమలుపై చర్చించారు. అలాగే గ్రామంలోని వివిధ సర్వే నంబర్లకు సంబంధించిన అంశాలను పరిశీలించారు.కోళ్ల ఫారం అనుమతులు రద్దు చేయాలని వినతి,సర్వే నెంబర్ 55/28, 55/48, 69/57, 69/2A, 67/58, 55/40, 55/2A, 55/18, 69/14, 55/4A, 69/28,67/4/2. 4/1/1, 69/18, 69/4/1/2, 55/17 209 2 6:00 2500092) 5 20:00 200కోళ్ల ఫారం వల్ల గ్రామస్తులకు ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, దాని అనుమతులను రద్దు చేయాలని గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామస్తులు కోరారు. ఈ మేరకు గ్రామపంచాయతీ కార్యదర్శికి వంశీదర్ వినతిపత్రం అందజేశారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *