తెలుగు న్యూస్ మంచిర్యాల జిల్లా;
కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని దండేపల్లి మండలంలోని గూడెం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , EO శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులు కొక్కిరాల సురేఖ, వంగపల్లి పూర్ణచందర్రావు, మాదంశెట్టి సత్యనారాయణ, సువర్ణం వెంకటరమణ, బొల్లం భీమయ్య, తాండ్ర లింగయ్య, బొలిశెట్టి కిషన్,అక్కల శకుంతల, పుప్పిరెడ్డి బాపురెడ్డి, ఆకుల తిరుపతి, బొద్దున సంధ్యారాణి, గట్టు స్రవంతి, అడ్డగురి రమేష్
ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ఆలయ పవిత్రతను కాపాడుతూ, భక్తుల విశ్వాసానికి అనుగుణంగా దేవస్థానం అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.కార్తీక పౌర్ణమి పర్వదినాన నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులకు శాలువాలతో సన్మానించి, హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వదించారు.అనంతరం స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులకు పులిహోర నైవేద్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, లక్షెట్టిపేట్ మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి-నర్సయ్య, వైస్ చైర్మన్ మోత్కూరు రాజేశ్వరి- వెంకటస్వామి గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు అక్కల వెంకటేశ్వర్లు, రామగిరి బానేష్, సింగిల్ విండో చైర్మన్లు నాగభూషణం, ముత్యాల శ్రీనివాస్, దేవేందర్ రెడ్డి, మంచిర్యాల జిల్లా RGPRS అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, మంచిర్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అర్కాల హేమలత, మంచిర్యాల పట్టణ మహిళా అధ్యక్షురాలు గజ్జల హేమలత, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





