తెలుగు న్యూస్ మంచిర్యాల జిల్లా :
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి నూతనంగా డీఎంఎఫ్‌టీ ఫండ్ నుండి రూ.20 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన రెండు అత్యదునిక అంబులెన్సులను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన, సత్వర వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అత్యవసర సమయాల్లో రోగులను త్వరితగతిన ఆసుపత్రికి తరలించేందుకు ఈ అంబులెన్సులు ఎంతగానో ఉపయోగపడనున్నాయని, నియోజకవర్గంలో వైద్య సదుపాయాలను వేగంగా మెరుగుపరుస్తున్నట్లు అత్యాధునిక వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలను అందుబాటులో ఉంచి, స్థానిక ప్రజలు అత్యవసర చికిత్స కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాబోయే ఏడాదిలోగా సంపూర్ణ వైద్య సదుపాయాలు కల్పిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దర్ణి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, నగర పాలక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్ , పలువురు కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





