ప్రాంతీయం

అధిక ధరకు బియ్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

6 Views

అధిక ధరకు బియ్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

* సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, విద్యాసంస్థల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి
* జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

తెలుగు న్యూస్ మంచిర్యాల:
అధిక ధరలకు బియ్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్  కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని మంచిర్యాల పట్టణం మెయిన్ రోడ్డులో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు లోబడి బియ్యం విక్రయాలు జరిపేందుకు వీలుగా శ్రీనాథ్ ట్రేడర్స్ వారు నూతనంగా ఏర్పాటు చేసిన బియ్యం అమ్మకాల అవుట్ లెట్ ను ఇన్చార్జి జిల్లా పౌర సరఫరాల అధికారి, సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన గరిష్ట ధరలకు మించి అమ్మకాలు జరుపకూడదని, నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. బి.పి.టి, హెచ్.ఎం.టి. తదితర రకాల బియ్యంను ప్రభుత్వ నిర్దేశిత ధరలకు అందించేందుకు గజానన్ ఇండస్ట్రీస్ ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. ఎల్ నినో ప్రభావం వల్ల ప్రస్తుతం మార్కెట్ లో నెలకొని ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బియ్యం వ్యాపారులు, ట్రేడర్లు అందరూ మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ ప్రజలకు బియ్యం ధరలను అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వ నిర్ణీత ధరకే విక్రయాలు జరిగేలా రెవెన్యూ, పౌర సరఫరాల శాఖల అధికారులతో ఆకస్మిక తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, తనిఖీల కోసం వచ్చే బృందాలకు వ్యాపారులు, ట్రేడర్లు సహకరించాలని తెలిపారు. 26 కిలోల బరువుతో కూడిన ప్రీమియం క్వాలిటీ బి.పి.టి. రా రైస్ బ్యాగ్ ను 1430 రూపాయలు, హెచ్.ఎం.టి స్టీమ్ రకం బియ్యం బస్తా 1898 రూపాయల చొప్పున అవుట్ లెట్ ద్వారా నిబంధనల ప్రకారం విక్రయాలు జరుపుతామని నిర్వాహకులు తెలిపారు. పట్టణంలోని చున్నంబట్టివాడ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించి, పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

జైపూర్‌ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర విద్యాలయాన్ని సందర్శించి తరగతి గదులు, వంటశాల, విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించారు. నిర్ణీత మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలని, హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేసి ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విధులకు హాజరు కావాలని సూచించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి వంటశాలను పరిశీలించారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఇంటర్మీడియట్ ఎంపిసి విద్యార్థులకు గణిత బోధన జరుగుతున్న తీరును పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యాసన సామర్ధ్యాలను తెలుసుకున్నారు. విద్యార్థినులకు మంజూరైన పడకలు, పరుపులను పరిశీలించి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.

అనంతరం చెన్నూర్ మున్సిపాలిటీలో అమృత్ 2.0 పథకం క్రింద చేపడుతున్న అభివృద్ధి పనులను  మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్‌ తో కలిసి పరిశీలించి, పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. చెన్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేసి, ఉపాధ్యాయులు సమయానికి విధులకు హాజరుకావాలని, విద్యార్థుల హాజరు శాతం, పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదుల పనులను పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వంటశాలను పరిశీలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థినులకు నిర్ణీత మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. విద్యార్థినులకు మంజూరైన పడకలు, పరుపులను పరిశీలించి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది*

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *