సీతారాంపల్లిలో ఘనంగా భూలక్ష్మి, మహా లక్ష్మీ,పోచమ్మ కొలుపు ఉత్సవాలు ప్రారంభం ప్రత్యేక పూజలు నిర్వహించిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్
తెలుగు న్యూస్ మంచిర్యాల:
*మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 09వ డివిజన్ సీతారాంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భూ లక్ష్మీ,మహా లక్ష్మీ,పోచమ్మ దేవతల కొలుపు ఉత్సవాలను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ గ్రామ పెద్దలతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మేయర్ దర్ని మధుకర్ అమ్మ వార్లకు ,పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, గ్రామంపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని పోచమ్మ తల్లిని ప్రార్థించారు.గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతను, భక్తిభావాన్ని, సంప్రదాయాలను పెంపొందిస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సూరిమిల్ల సౌమ్య , గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.





