ప్రాంతీయం

ఒకే దేశం-ఒకే ఎన్నిక అంశంపై వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్

7 Views

ఒకే దేశం-ఒకే ఎన్నిక అంశంపై వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్.

తెలుగు న్యూస్ మంచిర్యాల జిల్లా : ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంచిర్యాలలో ఒకే దేశం-ఓకే ఎన్నిక , అనే అంశంపై శనివారం రోజున వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ మంచిర్యాల జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంచిర్యాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జై కిషన్ ఓజా, అధ్యక్షత వహించారు, ఒకే దేశం-ఓకే ఎన్నిక, అనే అంశంపై డిగ్రీ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు, ఒకే దేశం-ఒకే ఎన్నిక, అంశంపై ప్రసంగించడానికి ప్రతి విద్యార్థిని, విద్యార్థులకు, మూడు నిమిషాల చొప్పున కాలవ్యవధిని న్యాయ నిర్ణేతలు నిర్ణయించారు, డిగ్రీ విద్యార్థులు ఎంతో ఆసక్తితో స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో వారి యొక్క ప్రసంగాల్ని చాలా ఉత్సాహంగా వ్యక్తిపరిచారు, ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంచిర్యాల ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ జై కిషన్ ఓజా, మాట్లాడుతూ ఒకే దేశం-ఓకే ఎన్నికపై, అంశం పై నిర్వహించిన సెమినార్ లో (1)ఏ. కార్తీక్, (ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంచిర్యాల) 2, శివ నందిని (వాగ్దేవి డిగ్రీ కళాశాల),3 సాయి విగ్నేష్, (మి మ్స్, డిగ్రీ కళాశాల విద్యార్థులు మొదటి మూడు స్థానాలు సాధించినట్లు, విద్యార్థిని, విద్యార్థులు, చక్కగా పలు అంశాలను వివరించారని, విద్యార్థులను అభినందిస్తున్నట్టు యువత ఎన్నికల్లో పాల్గొంటూ ఎన్నికలపై అవగాహన లేని వారికి చైతన్యం కలిగించాలని, నాయకుల్ని ఎన్నుకునే విధానంలో ఓటర్ ప్రాధాన్యతే ఎక్కువగా ఉంటుందని, దేశ అభివృద్ధికి ఎన్నికలు ఎంతో కీలకమని, ఓటు వేసే సమయంలో ఇలాంటి ప్రలోభాలకు లొంగకుండా, దేశ భవిష్యత్తు అంతా నేటి యువత చేతుల్లో ఉందని, విద్యార్థిని విద్యార్థులకు హితవు పలికారు, ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఎం. కుమారస్వామి, అధ్యాపకులు, పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *