రాయపోల్ మండల కేంద్రంలో నిర్వహించిన బహుజన బతుకమ్మ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అరుణోదయ సాంస్కృతిక సమైక్య అధ్యక్షురాలు విమలక్కకు రాయపోల్ ఎమ్మార్పీఎస్ కమిటీ సభ్యులు ఆమె చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. ఈ సందర్భంగా విమలక్కను వారు మర్యాదపూర్వకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు రవి, రాయపోల్ సర్పచ్ రాజు, సీనియర్ నాయకులు పుర నర్సింలు, మాజీ సర్పంచ్ స్వామి, ఉపాధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి మల్లేశం, జర్నలిస్టులు శ్రీనివాస్, గణేష్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.





