ప్రాంతీయం

బాహ్య మూల్యాంకనాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి

44 Views

సిద్దిపేట్, సెప్టెంబర్ 30, తెలుగు న్యూస్ 24/7

బాహ్య మూల్యాంకనాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి-జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్,ఒకటవ తరగతి నుండి 9వ తరగతి వరకు నిర్వహించే సమ్మేటివ్ -1, మరియు సమ్మేటివ్ – 2 పరీక్షల బాహ్య మూల్యాంకనాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ డిమాండ్ చేశారు.పాఠశాలల సందర్శన సభ్యత్వ సేకరణ కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ మండల అధ్యక్షులు తాళ్ల నాగరాజు, ఆధ్వర్యంలో గజ్వేల్ మండలంలోని ముట్రాజ్ పల్లి, ఆర్ అండ్ ఆర్ కాలనీ -1, ఆర్ అండ్ ఆర్ కాలనీ – 2,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆర్ అండ్ ఆర్ కాలనీ, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ఆదర్శ పాఠశాల గజ్వేల్,ప్రజ్ఞాపూర్,కొడకండ్ల, రిమ్మన గూడ, దాతర్ పల్లి, అక్కారం, కోనాపూర్, శ్రీగిరి పల్లి, తదితర పాఠశాలలను సందర్శించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా బాహ్య మూల్యాంకనం పై మాట్లాడుతూ గతంలో ఏడవ తరగతికి జిల్లా బోర్డు పరీక్షలు నిర్వహించి దానిలో ఉత్తీర్ణులైన వారిని పై తరగతికి పంపేవారని, ప్రస్తుతం ఆ విధానం రద్దు కావడం వలన ఒకటి నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి పరీక్ష ఫలితాలు, మార్కులు, ర్యాంకులు,ఉత్తీర్ణత లాంటి విషయాలతో సంబంధం లేకుండా పైతరగతులకు ప్రమోట్ చేయడం జరుగుతుందని, ప్రస్తుతం పాఠశాలలో నిరంతర సమగ్ర మూల్యాంకనం ఆధారంగా బోధన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఇలాంటి పరిస్థితులలో బాహ్య మూల్యాంకనం చేపట్టడం ఉపాధ్యాయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉంటుందని వెంటనే బాహ్య మూల్యాంకన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.జిల్లా ఉపాధ్యక్షులు పాపగారి పాపి రెడ్డి,జోన్ కన్వీనర్ జల్లెల శ్రీనివాస్, గజ్వెల్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాళ్ల నాగరాజు గోక విద్యాసాగర్ లు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ అనంతరం ఉద్యోగికి ఆర్థిక భరోసాను కల్పించడానికి సిపిఎస్ ను రద్దు చేస్తూ, వెంటనే పాత పెన్షన్ ను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.ఇట్టి కార్యక్రమం లో జిల్లా కౌన్సిలర్ దమ్మని మల్లయ్య, పంబాల ఎల్లయ్య,జగదేవ్ పూర్ మండల నాయకులు సత్తయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *