సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని రాంసాగర్ గ్రామ రామాలయ గోపురంపై సాయంత్రం వేళ చంద్రుడు దర్శనమిస్తూ కనువిందు చేశాడు. ఆలయ గోపురం, ఆకాశంలో వెలుగుతున్న పౌర్ణమి చంద్రుడు కలసిన దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. ప్రకృతి అందాలకు ఆధ్యాత్మికత తోడైన ఈ దృశ్యం కెమెరాకు చిక్కింది.





