ప్రాంతీయం

కమిషనరేట్ పరిధిలో జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 5,261 కేసుల పరిష్కారం

5 Views

రామగుండం పోలీస్ కమిషనరేట్

కమిషనరేట్ పరిధిలో జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 5,261 కేసుల పరిష్కారం

125 సైబర్ నేర కేసుల్లో బాధితులకు రూ.33,65,739/- తిరిగి అందజేత

తేదీ 12-09-2026న నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదై దర్యాప్తులో ఉన్న, అలాగే న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న రాజీకి వీలైన కేసుల్లో 613 భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) కేసులు,ప్రత్యేక చట్టాలకు సంబంధించిన 36 కేసులు పరిష్కరించబడ్డాయి.

📌 ఈ-చలాన్ కేసులు – 2,872

📌 మద్యం సేవించి వాహనం నడిపిన కేసులు – 1,740

ఈ విధంగా మొత్తం 5,261 కేసులు పరిష్కరించబడ్డాయి.

125 సైబర్ నేర కేసుల్లో బాధితులకు రూ.33,65,739/- తిరిగి అందజేత

📌 రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన 123 సైబర్ నేర కేసుల్లో బాధితులకు రూ.27,58,843/- తిరిగి అందజేయబడింది.

📌 సీసీపీఎస్ పోలీస్ స్టేషన్, రామగుండంలో నమోదైన 2 సైబర్ నేర కేసుల్లో బాధితులకు రూ.6,06,896/- తిరిగి అందజేయబడింది.
ఈ వివరాలను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ,లోక్ అదాలత్ ద్వారా పెట్టీ కేసులు,ట్రాఫిక్, ఎక్సైజ్,మద్యం సేవించి వాహనం నడిపిన కేసులు తదితర స్వల్ప నేరాలకు సంబంధించిన కేసులు వేగంగా పరిష్కరించబడినట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం ద్వారా ప్రజలకు సమయం,ధనం ఆదా అయ్యాయని పేర్కొన్నారు.
ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేసుల పరిష్కారానికి సహకరించారని తెలిపారు. పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఈ విజయవంతమైన ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు.
గత 15 రోజులుగా రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు, న్యాయస్థాన సిబ్బంది కేసుల్లోని పక్షాలను స్వయంగా కలిసి,రాజీ మార్గమే ఉత్తమమార్గమని, లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం పొందవచ్చని అవగాహన కల్పించారని తెలిపారు.దీంతో నిర్దేశించిన లక్ష్యానికి మించి కేసులను పరిష్కరించగలిగామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా అభినందించారు. ప్రతిరోజూ కేసుల పరిష్కారాన్ని పర్యవేక్షించిన అధికారులు,కృషి చేసిన సిబ్బందికి త్వరలో పురస్కారాలు అందజేస్తామని తెలిపారు.
అలాగే, కమిషనరేట్‌లో నిరంతరం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేసిన రెండు జోన్ల ప్రధాన న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవా సంస్థలకు పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతిరోజూ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు న్యాయస్థాన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *