సిద్దిపేట, ఆగస్టు 26, తెలుగు న్యూస్ 24/7
పి.ఆర్.ఏ స్క్వేర్ ఇంటీరియర్స్ నూతన ప్రారంభోత్సవం.ముఖ్య అతిథిగా పాల్గొన్న వంగ రాజేశ్వర్ రెడ్డి,సిద్దిపేట పట్టణంలో పి.ఆర్.ఏ స్క్వేర్ ఇంటీరియర్స్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వంగ రాజేశ్వర్ రెడ్డి,ముఖ్య అతిథిగా హాజరై, సంస్థ నిర్వాహకులు కొలుపుల ప్రవీణ్, ని కలిసి నూతనంగా ప్రారంభించిన ఇంటీరియర్స్ సంస్థకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వంగ రాజేశ్వర్ రెడ్డి, మాట్లాడుతూ, సిద్దిపేటలో నూతన వ్యాపార సంస్థలు ప్రారంభించడం అభినందనీయమని, యువత వ్యాపార రంగంలో రాణిస్తూ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. పి.ఆర్.ఏ స్క్వేర్ ఇంటీరియర్స్ సంస్థ భవిష్యత్తులో మంచి పేరు సంపాదించి, విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకున్నారు.





