ప్రాంతీయం

ఘనంగా ఖమ్మం ప్రెస్ క్లబ్ 24వ వార్షికోత్సవం

37 Views

ఘనంగా ఖమ్మం ప్రెస్ క్లబ్ 24వ వార్షికోత్సవం

– జర్నలిస్టుల ఐక్యతకు ప్రతీక 

– యూనియన్లకు అతీతంగా వేడుక

ఖమ్మం, మార్చి 03, తెలుగు న్యూస్ 24/7 

ఖమ్మం ప్రెస్ క్లబ్ 24వ వార్షికోత్సవ వేడుకలు మంగళ వారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించబడ్డాయి. జిల్లాలోని వివిధ జర్నలిస్టు యూనియన్లకు చెందిన సీనియర్, జూనియర్ విలేకరులు, జర్నలిస్టు నేతలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తొలుత ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక నిర్వాహకులు, సీనియర్ జర్నలిస్ట్ మోత్కూరి వెంకటేశ్వర్లును స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంతోటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు.ఈ వేడుకల సందర్భంగా 5 కిలోల భారీ కేక్‌ను కట్ చేసి జర్నలిస్ట్ లకు పంచిపెట్టారు. స్నేహసౌహార్ద వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం ప్రెస్ క్లబ్ కుటుంబస్ఫూర్తిని ప్రతిబింబించింది. 24 ఏళ్ల ప్రస్థానంలో ప్రెస్ క్లబ్ సాధించిన విజయాలను స్మరించుకుంటూ, సీనియర్ జర్నలిస్టుల సేవలను గుర్తు చేసుకున్నారు. సభలో ఐజేయు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నామ పురుషోత్తం, టీజేఎఫ్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, టిడబ్ల్యూజేఎఫ్ ప్రెస్ క్లబ్ (హెచ్-2843) అధ్యక్షుడు అంతోటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మల్లెల శిల్ప తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్ జర్నలిస్టులకు దేవాలయం లాంటిదన్నారు. బాధితుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కార మార్గాలు చూపడంలో ప్రెస్ క్లబ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు, హక్కుల సాధనకోసం యూనియన్లకతీతంగా ఇదే తరహాలో ఐకమత్యంతో పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు సంతోష్ చక్రవర్తి, జిల్లా కార్యదర్శి నానబాల రామకృష్ణ, జిల్లా కోశాధికారి అర్వపల్లి నగేష్‌తో పాటు గెంటెల కుమార్, ఎలుగోటి వెంకట్, కప్పల మధు, నల్ల రాకేష్, జిల్లెల్ల మల్లేష్, షేక్ సోనియా, చిన్నంశెట్టి రాంబాబు, బుర్ర శ్రీనివాస్ కళ్యాణం, ప్రగాని గోపీచంద్, షేక్ నాగుల్ మీరా, వేల్పుల జ్యోతి, శీలం కరుణాకర్ రెడ్డి, గౌరవరపు జగదీష్ శ్రీనివాస్, మొగిలి నాగేశ్వరరావు, దునక శ్రీనివాసరావు, మద్దెల చిన్ని, టి.బిక్షం, నీరుడు రాంబాబు, పాగ యోనా, కొండలరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం సభ్యులకు భోజన విందు ఏర్పాటు చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *