సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల వ్యాప్తంగా వర్షాలు, ఈదురుగాలులు కురుస్తున్నందున ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గజ్వేల్ సీఐ రవికుమార్ సూచించారు. వర్షాల ప్రభావంతో ఏమైనా సమస్యలు లేదా అత్యవసర పరిస్థితులు తలెత్తితే తక్షణమే 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందవచ్చని ఆయన తెలిపారు. కూలిపోయే ప్రమాదం ఉన్న పాత ఇళ్లు, శిథిలావస్థలో ఉన్న గోడలు, చెట్ల కింద నిలబడకూడదన్నారు. ఈదురుగాలుల వల్ల విద్యుత్ వైర్లు తెగిపడే అవకాశం ఉన్నందున విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్దకు వెళ్లరాదన్నారు. ఉధృతంగా ప్రవహించే వాగులు, వంకలు, కల్వర్టులను దాటే ప్రయత్నం చేయకూడదన్నారు. ప్రజల రక్షణ కోసం పోలీసు యంత్రాంగం మరియు అత్యవసర సేవలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయన్నారు. ఏ చిన్న ప్రమాదం జరిగినా లేదా ఆపద వచ్చినా వెంటనే డయల్ 100కి కాల్ చేయాలన్నారు.




