ప్రాంతీయం

హెల్మెట్ మీ ప్రాణాలకు రక్షణ కవచం, ప్రతి ప్రయాణంలో తప్పనిసరిగా ధరించండి

9 Views

*రామగుండం పోలీస్ కమిషనరేట్*

*హెల్మెట్ మీ ప్రాణాలకు రక్షణ కవచం… ప్రతి ప్రయాణంలో తప్పనిసరిగా ధరించండి*

రామగుండం పోలీస్ కమిషనరేట్,పెద్దపల్లి జోన్,గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ చౌరస్తాలో గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి,ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, ముఖ్యంగా హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ,ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు జరిమానాలు విధించడమే లక్ష్యంగా పనిచేయడం లేదని, ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడడమే పోలీసుల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,అలాగే కార్లు,ఇతర నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.సామాజిక మాధ్యమాల్లో లేదా ఇతర మార్గాల్లో “గల్లీ ల్లో తిరిగితే హెల్మెట్ అవసరం లేదు”, “చిన్న దూరానికి వెళ్తే హెల్మెట్ పెట్టుకోనవసరం లేదు” వంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రమాదం ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందో ఎవరూ చెప్పలేరని,చిన్న దూరం ప్రయాణం లోనూ ప్రాణాంతక ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు.హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే ప్రమాదాల్లో తలకు తీవ్రగాయాలు కావడంతో పాటు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ,నిర్లక్ష్యం వల్ల కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నాయనన్నారు.ట్రాఫిక్ నిబంధనలు నగరంలోని ప్రధాన రహదారులకే కాకుండా ప్రతి రహదారి,ప్రతి వీధిలో సమానంగా అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.జరిమానాల భయంతో అయినా హెల్మెట్ ధరించే అలవాటు చేసుకుంటే చివరకు అదే వారి ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు.పాల ప్యాకెట్ తీసుకురావడానికి, సమీప దుకాణానికి వెళ్లడానికి లేదా చిన్న పని కోసం మాత్రమే వెళ్తున్నామని భావించి హెల్మెట్ ధరించకుండా ప్రయాణించ వద్దని సూచించారు.ప్రతి ప్రయాణంలో హెల్మెట్ ధరించడం వ్యక్తిగత భద్రతతో పాటు కుటుంబ సభ్యుల భవిష్యత్తుకు కూడా రక్షణగా నిలుస్తుందని అన్నారు.ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి,హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగాన్ని జీవితంలో భాగంగా చేసుకోవాలి.ప్రజల ప్రాణాలను కాపాడటమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *