పేద బిడ్డకు అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.
మంచిర్యాల నియోజకవర్గం.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ పట్టణానికి చెందిన లగిశెట్టి శ్రీనివాస్ కూతురు లగిశెట్టి *స్పందన* MS చదువుకోడానికి అమెరికాలోని *చికాగో* కు వెళ్లడం జరిగింది. ఇటీవల స్పందన మెట్రో స్టేషన్ యందు ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రగాయాలతో కోమా లోనికి పోవడంతో అమెరికాలోని ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతుందని మంచిర్యాల గౌరవ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి చెప్పగానే ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి, స్పందన తల్లిదండ్రులకు అమెరికా వెళ్లేందుకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సీఎంఓ అధికారులతో మాట్లాడి పాస్ పోర్ట్ మరియు వీసా మంజూరు చేయించి, టికెట్ మరియు ఇతర ఖర్చులకు మూడు లక్షల రూపాయలు (3,00,000) స్పందన తల్లిదండ్రులకు అందజేసిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.
ఆ భగవంతుడి ఆశీస్సులతో స్పందన అతి త్వరగా కోలుకోవాలని కోరారు.





